కక్ష సాధింపులకు పాల్పడుతున్న బీజేపీ  : మంత్రి పొన్నం ప్రభాకర్​

కక్ష సాధింపులకు పాల్పడుతున్న బీజేపీ  : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: ఈడీ, సీబీఐ మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ఆరోపించారు. గురువారం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం నేడు మోదీ చేతిలో కక్ష సాధింపులకు గురవుతోందన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలని ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నరని మండిపడ్డారు.

ఇది రాజకీయ కక్ష సాధింపేనన్నారు. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామన్నారు. ఎల్లమ్మ చెరువు, ఆరెపల్లి జంక్షన్​ సుందరీకరణ పనులను స్పీడప్​ చేసి త్వరగా కంప్లీట్​ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆయన వెంట జిల్లా లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, సింగిల్​విండో చైర్మన్​ శివ్వయ్య ఉన్నారు.